తెలుగు ప్రేక్షకులకు నటి షకీలా గురించి ఆమె ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో వ్యాంపు పాత్రలలో నటించి భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది.ఒకానొక సమయంలో ఈమె సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లు వద్ద గుమ్మి కూడేవారు. సినిమాలలో అలాంటి పాత్రలలో నటిస్తున్నప్పటికీ షకీలాకు కొన్ని చెడు అలవాట్లకు బానిస కావడం జరిగిందట. ముఖ్యంగా సిగరెట్లు తాగడం ఈమెకు పెద్ద వ్యాసనంగా మారిపోయిందని తెలుస్తోంది.

తాజాగా ఇమే తెలుగు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న సమయంలో హౌస్ లో పెద్ద ఎత్తున సిగరెట్లు కాల్చిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇలా షకీలా సిగరెట్టులకు  బానిస కావడానికి ఒక హీరోయిన్ కారణమని ఒకానొక సందర్భంలో తెలియజేసింది. బిగ్బాస్ హౌస్ లోకి రాకముందు షకీలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపింది. ఈమె సిగరెట్లు కాల్చడానికి కారణం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ అనే విధంగా తెలియజేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి పూజ చాలా స్టైలిష్ గా సీక్రెట్గా సీక్రెట్ లను కాల్చేదట. తనను చూసి తాను కూడా అలాగే కాల్చాలనుకున్నానని తెలియజేసింది షకీలా.


ఇలా పూజ భట్ ను చూసి తనలాగే షకీలా కూడా సిగరెట్లు కాల్చాలని ఉద్దేశంతోనే కాల్చడం మొదలుపెట్టిందని తెలియజేసింది. అయితే చివరికి అదే అలవాటుగా మారి వ్యాసనంగా మారిపోయిందని షకీలా ఇంటర్వ్యూలో తెలియజేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. షకీలా తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ రెండు వారాలకి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకొని హౌస్ లో నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. అయితే హౌస్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడడం జరిగింది షకీలా. అభిమానులు మాత్రం మరో కొద్ది వారాలు షకీలాని బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఉంటే మేలని భావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: