ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకొని గ్లోబల్ స్టార్ గా మారారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం దేవర..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు  పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని అండర్ వాటర్ యాక్షన్స్ సన్నివేశాలు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం దాదాపు కొన్ని నెలల తరబడి సెట్టింగ్స్ వేస్తూ సముద్ర గర్భం లో జరిగే యాక్షన్స్ సన్నివేశాలను కోసం సముద్రాన్ని తలపించేలా సరికొత్త టెక్నాలజీ ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ సీన్ కోసం చాలా మంది ఫైటర్లు కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరగబోతున్నట్లు సమాచారం. అక్కడ కొన్ని సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇంతవరకు చూడని సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని మత్స్యకార గ్రామం చుట్టూ తిరిగే కథ అంశముగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బీచ్ సేట్ ను రూపొందిస్తున్నారు. తీర ప్రాంతాన్ని తలపించేలా   టన్నుల కొద్ది ఇసుకని కర్ణాటకలోని కొన్ని టాప్ బీచ్ లో ఇసుకని అలాగే కొన్ని బండరాళ్లను కూడా వివిధ ప్రాంతాల నుంచి తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: