
దీనితో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తరువాత చేయబోయే మూవీ అట్లీ దర్శకత్వంలో ఉంటుంది అంటూ అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. వాస్తవానికి అల్లు అర్జున్ తో సినిమా చేయబోయే దర్శకుల లిస్టు రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. కొంత కాలం క్రితం కొరటాల శివ దర్శకత్వంలో అదేవిధంగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ తో సినిమా ఉంటుందని అధికారిక ప్రకటనలు కూడ వచ్చాయి.
అయితే ఆతరువాత ఆ ఇద్దరి దర్శకులు మౌనం వహించారు. ఆతరువాత బన్నీ తో సినిమాలు చేసే దర్శకుల లిస్టులో బోయపాటి శ్రీను సురేంద్ర రెడ్డి రోహిత్ శెట్టి మురగ దాస్ లింగు స్వామి పుష్కర్ అండ్ గాయత్రి నెల్సన్ పేర్లు కూడ చాల కీలకంగా వినిపించాయి. అయితే వీరెవ్వరు బన్నీ తో సినిమా చేసే విషయంలో రకరకాల కారణాలతో ముందడుగు వేయలేకపోయారు.
ఇప్పుడు ‘జవాన్’ సూపర్ సక్సస్ తరువాత దర్శకుడు అట్లీ పేరు మారుమ్రోగి పోతున్న పరిస్థితులలో ఈ దర్శకుడు బన్నీ తో సినిమా చేయడం ఖాయం అంటూ లీకులు వస్తున్నాయి. వాస్తవానికి ‘పుష్ప’ మూవీ తరువాత అల్లు అర్జున్ రేంజ్ విపరీతంగా పెరిగిపోవడంతో అతడితో సినిమాలు చేయడానికి ఎందరో దర్శకులు క్యూలో ఉన్నారు. బన్నీ మాత్రం తన మనసులో మాట బయటపెట్టకుండా తన వద్దకు వస్తున్న చాల మంది దర్శకులలో ఆశలు కలిపిస్తున్నాడు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. దీనితో బన్నీ పరీక్షల ముందు అట్లీ ఎంతవరకు నిలబడతాడో చూడాలి..