తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి సైహద్ సొహెల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన బిగ్ బాస్ కంటే ముందు కొన్ని సీరియల్స్ లో నటించి బుల్లి తెర ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా ఈ నటుడి కి ఫుల్ గా క్రేజ్ లభించింది. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఈయనకు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కుతున్నాయి. 

అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో ఈ నటుడు మెయిల్ ప్రెగ్నెంట్ పాత్రలో నటించాడు. ఇక మెయిల్ ప్రెగ్నెంట్ లాంటి ఒక వైవిధ్యమైన పాత్రలో సోహేల్ నటించడంతో ఈ మూవీ పై విడుదలకు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్ట లేక పోయింది. దానితో చివరగా ఈ మూవీ ఫెయిల్యూర్ గానే మిగిలి పోయింది. 

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇకపోతే తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ అక్టోబర్ 6 వ తేదీన ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఈ రెండు డిజిటల్ ప్లాట్ ఫామ్ లు తాజాగా అధికారికంగా ప్రకటించాయి. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: