
బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలకు విపరీతమైన ఏర్పడటంతో ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు తెలుగు సినిమాల వైపు చూస్తోంది. ‘బాహుబలి’ తో ఒక్కసారిగా పెరిగిన మార్కెట్ ‘ఆర్ ఆర్ ఆర్’ ‘పుష్ప’ సినిమాలతో మరింత పెరిగి పోయింది. దీనితో టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేస్తూ హిందీలో కూడ మన టాప్ హీరోల మార్కెట్ పెరుగుతోంది.
ఈ పరిషితుల నేపధ్యంలో నసరుద్దీన్ షా ‘పుష్ప’ ఆర్ ఆర్ ఆర్’ మూవీల పై కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశాడు. తాను ‘పుష్ప’ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలను చాల కాలం చూడలేదని అయితే ఈమధ్యనే వాటిని చూడాలని ప్రయత్నించి ఆసినిమాలను పూర్తిగా చూడలేకపోయాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు ఆమూవీలలో తనకు హీరోల ఎలివేషన్ తప్పించి ప్రత్యేకంగా తనకు ఏమికనిపించలేదు అంటూ నసిరుద్దీన్ షా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వాస్తవానికి తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అందుకుంటున్న గౌరవాలకు ఘన విజయాలకు అనేక ప్రశంసలు లభిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య నసిరుద్దీన్ షా ‘పుష్ప’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తనకు నచ్చలేదు అంటూ అతడు చేసిన నెగిటివ్ కామెంట్స్ అతడి సంకుచిత్వాన్ని సూచిస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో అనేకమంది అతడిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు..