సినిమాలు రాజకీయాలు అన్నీ సెంటిమెంట్ పైనే నడుస్తాయి. సినిమాలకు సంబంధించి ఒకొక్క టైమ్ లో ఒకొక్కసెంటిమెంట్ హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఈమధ్య కాలంలో విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ కొట్టిన కొన్ని సినిమాలలో జైల్ సీన్స్ ఆసినిమాల ఘనవిజయానికి సెంటిమెంట్ గా మారాయి. ‘జైలర్’ మూవీలో జైల్ సీన్స్ ఆమూవీ హిట్ కు సహకరించిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా విడుదలై ఘనవిజయం సాధించిన ‘జవాన్’ మూవీలో కూడ జైల్ సీన్స్ ఆసినిమా ఘన విజయానికి బాగా సహకరించాయి.



దసరా ను టార్గెట్ చేస్తూ రాబోతున్న బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ మూవీలో కూడ వచ్చే కొన్ని కీలక జైల్ సన్నివేశాలు ఆమూవీకి అత్యంత కీలకంగా మారుతాయని అంటున్నారు. మరీముఖ్యంగా జైల్ సన్నివేశాలలో బాలకృష్ణ నటనకు ధియేటర్లలో చప్పట్లు మారుమ్రోగడం ఖాయం అంటున్నారు. ఇక అదే దసరా ను టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న రవితేజా ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ మూవీలో కూడ కొన్ని కీలకం అయిన జైల్ సన్నివేశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.



ఈదసరా కు విడుదలకాబోతున్న మరొక డబ్బింగ్ సినిమా కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ నటించిన ‘ఘోస్ట్’ మూవీ పై కూడ ఒక షాకింగ్ రూమర్ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈమూవీలో కూడ ‘జైల్’ సీన్స్ కీలకం కానున్నాయని అంటున్నారు. అనూహ్యంగా ఈమూవీ కూడ దసరా రేస్ లోకి ఎంటర్ అయింది. కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ కు బాలకృష్ణకు మంచి సాన్నిహిత్యం కూడ ఉంది.



ఇలాంటి పరిస్థితులలో ఒకేరకం సెంటిమెంట్ అదేవిధంగా ఒకేరకం సీన్స్ గల సినిమాలు ఒకదానిపై ఒకటి దసరా రేస్ కు రాబోతున్న నేపధ్యంలో ఒకేరకం సీన్స్ ఉన్న సినిమాలను ఎంతవరకు ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న సందేహాలు కూడ ఉన్నాయి. ఈమధ్య కాలంలో తెలుగు సినిమాలలో కూతురు మనవడు సెంటిమెంట్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు ‘జైల్’ సీన్స్ సెంటిమెంట్ కూడ కొత్తగా ఎంటర్ కావడంతో మరో కొత్త సెంటిమెంట్ వైపు టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ అడుగులు వేస్తోంది అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: