శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు అన్నీ కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. అందరిలా కమర్షియల్ హంగుల జోలికి పోకుండా నాచురాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలను తీస్తూ ఉంటాడు శేఖర్ కమ్ముల. ఇక ఆయన సినిమాలోని పాత్రలన్నీ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సినిమాల్లో స్వయంగా ప్రేక్షకులే నటిస్తున్నారేమో అన్న విధంగా పాత్రలు ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి నాచురాలిటీకి  దగ్గరగా ఉండే సినిమాలలో ఫిదా సినిమా కూడా ఒకటి. వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఫిదా సినిమా తెలుగు ప్రేక్షకులందరిని నిజంగానే ఫిదా చేసేసింది.


 అచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి స్వయంగా తన పాత్రకు తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పుకోవడం అయితే తెలుగు ప్రేక్షకులను మంత్రమతుల్ని చేసింది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి అక్క పాత్ర సినిమా మొత్తం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా మరో నటిని అనుకున్నారట. ఆ నటి ఎవరో కాదు హరితేజ. మామ మష్చంద్ర సినిమా ఆరవ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హరితేజ కీలక పాత్రలో నటించింది.


 హైదరాబాద్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేఖర్ కమ్ముల అతిథిగా హాజరయ్యారు. అయితే హరితేజ శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుతూ.. మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది. నేను మీ మూవీస్ కు పెద్ద అభిమానిని. ఫిదా సినిమాలో ఒక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్ కు పిలిచారు. నాకు మీ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఒక కోరిక. దీంతో మూడుసార్లు అడిషన్ కి వచ్చాను. కానీ రిజెక్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు తెలంగాణ యాస రాదు. మూవీ చూశాక తెలంగాణ యాసపై దృష్టి పెట్టి మరి నేర్చుకున్నాను అంటూ హరితేజ చెప్పుకొచ్చింది. కాగా ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్క పాత్రలో శరణ్య ప్రదీప్ నటించి ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: