నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి  సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఓటిటి లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని థియేటర్స్ లో మిస్ అయిన వారందరూ ఈ సినిమా కోసం చాలా ఎదురు చూశారు. వాళ్ళ ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. థియేటర్స్ లో భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఓటీటీ లో కూడా దూసుకుపోతోంది. అంతేాకుండా స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్ ని సాధించి మొదటి ప్లేస్ లో నిలిచింది ఈ సినిమా.

సందేశాత్మక సినిమా  గా వచ్చిన  భగవంత్ కేసరి సినిమా తెలుగులోనే కాకుండా హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ టాప్ వన్ ట్రెండింగ్ లో ఉంది భగవంత్ కేసరి. అలాగే హిందీ వర్షన్ లో టాప్ 3 లో నిలిచింది. దాంతోపాటు గూగుల్ లో సైతం అత్యధిక మంది వెతికిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక ఇందులో శ్రీ లీల బాలకృష్ణ ల మధ్య ఉన్న అనుబంధం ఈ సినిమాకి హైలెట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ఈ విషయాన్ని అమెజాన్ తెలుపుతూ ఒక పోస్టర్ని

సైతం ఇటీవల విడుదల చేసింది. ఆడపిల్లలను సింహాల్లా పెంచాలనే మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రంలోని డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నేలకొండ భగవంత్‌కేసరి పాత్రలో బాలకృష్ణ తన యాక్టింగ్‌తో అదరగొట్టారు. అలాగే అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాకు ఊహించిన దాని కంటే మంచి స్పందన వచ్చింది. ఈ ఆనందంలో నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్స్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఓ కారును (టయోటా) కానుకగా ఇచ్చింది. దీంతో ప్రస్తుతం అనిల్ రావి పుడి కారుని అందిస్తున్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: