మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె నాగబాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను ఏర్పాటు చేసుకుంది. ఇకపోతే ఈమే కేవలం సినిమాల్లో నటించి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడం మాత్రమే కాకుండా కొంత కాలం క్రితం ఒక వెబ్ సిరీస్ ను నిర్మించిన నిర్మాతగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ రీసెంట్ గా ఏ సినిమాలో నటించలేదు. కాకపోతే సినిమా ఈవెంట్ లకి మాత్రం అటెండ్ అవుతూ వస్తుంది. ఇకపోతే తాజాగా నాచురల్ స్టార్ నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ కి వషిం అబ్దుల్ వాహేబ్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ ఈవెంట్ ను నిర్వహించారు. దానికి అనేక మంది సినీ ప్రముఖులు విచ్చేశారు. అందులో భాగంగా నిహారిక కూడా ఈ ఈవెంట్ కి విచ్చేసింది. ఇక నిహారిక ఈవెంట్ కు అదిరిపోయే లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని వచ్చింది. ఇక ఈ డ్రెస్ లో ఈ బ్యూటీ అదిరిపోయి రేంజ్ లో ఉండడంతో ఈ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని ఈ ముద్దు గుమ్మ వైపే తిరిగాయి. ప్రస్తుతం ఈవెంట్ కు సంబంధించిన నిహారిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: