బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం యానిమల్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కాగా ఇందులో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన హీరోయిన్గా నటించడం తో పాటు ఈ సినిమాని సౌత్ ఆడియన్స్ ముందుకు తీసుకురాపోతున్నారు. ఇప్పటికి ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ఆడియోస్ని అమాంతం ఆకట్టుకున్నాయి.

దాంతోపాటు ఇందులో రణబీర్ లుక్ మేనరిజం మాస్ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చాయి. దీంతో ఇప్పటికే ఈ సినిమాని చూడడం కోసం సినీ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల కొద్ది రోజులుగా తెలుగు మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నారు యానిమల్ చిత్ర బృందం. వరుసగా మీడియా సమావేశాలను పెడుతున్నారు. అయితే ఇటీవల నవంబర్ 27న హైదరాబాదులోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు చిత్ర బృందం. ఇక ఈ వేడుకకి సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా వచ్చారు.

 దాంతో పాటు వందలాదిమంది విద్యార్థులతో యూనివర్సిటీ మొత్తం ఫుల్ అయిపోయింది. అయితే ఈ వేడుకలో మహేష్, రణబీర్ సింపుల్ అండ్ స్టైలీష్ లుక్స్ ఆకర్షించాయి. మహేష్ సింపుల్ టీషర్ట్ తో కనిపించగా.. రణబీర్ కపూర్ తన డాషింగ్, హ్యాండ్సమ్ అప్పియరెన్స్‌తో ఈవెంట్‌లో దృష్టిని ఆకర్షించాడు. మస్టర్డ్-కలర్ ప్రాడా బ్లేజర్ ధరించి కూల్ లుక్ లో కనిపించాడు. అయితే చాలా మంది దృష్టిని ఆకర్షించింది అతని స్వెడ్ బాంబర్ జాకెట్ ధర మాత్రమే. ఇప్పుడు ఆ జాకెట్ ధర గురించి నెట్టింట వైరలవుతుంది. ఎందుకో తెలుసా.. ఆ జాకెట్ ధర రూ. 4.35 లక్షలు మరీ. మీరు విన్నది నిజమే.. సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ డీకోడ్ అనే ఇన్ స్టా పేజీలో రణబీర్ జాకెట్ కు సంబంధించిన అన్ని వివరాలను ఇచ్చారు. అలా ఈ జాకెట్ ధర విన్న అభిమానులు షాక్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: