'సీతారామం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఈ సినిమాలో సీత పాత్రలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత టాలీవుడ్ లో మృణాల్ కి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.  సీతారామం సక్సెస్ తరువాత మృణాల్ ఠాకూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ నుంచి విశేష స్పందన అందుకున్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో మృణాల్ మరో సక్సెస్ ని అందుకోవడం

 ఖాయమనే మాట వినిపిస్తుంది. ఫస్ట్ మూవీ తోనే తన టాలెంట్ ని నిరూపించుకున్న ఈమె  ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. టాలీవుడ్ లో నంబర్ వన్ ప్లేస్ కోసం తాపత్రయపడుతోంది. రీసెంట్ టైమ్స్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్న పూజ హెగ్డే గత కొంతకాలంగా వరుస అపజయాలతో ఆ స్థానాన్ని పోగొట్టుకుంది. ఆమె తర్వాత యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ దృష్టిని తన వైపు తిప్పుకోని నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లాలని ట్రై చేసినా స్కంద, ఆదికేశవ ఫ్లాప్స్ తో డీలా పడింది. 

ఇక ఇప్పుడు ఆ చాన్స్ మృణాల్ ఠాకూర్ కి వచ్చింది. ఈ మృణాల్ తన సక్సెస్ ని అలాగే కంటిన్యూ చేస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ టాప్ హీరోయిన్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక మృణాల్ ఠాకూర్ తాజాగా నటించిన 'హాయ్ నాన్న' మూవీకి ఆడియన్స్ లో ఇప్పటికే పాజిటివ్ హైప్ ఏర్పడింది. అటు మూవీ టీం కూడా సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాబట్టి హాయ్ నాన్న మృణాల్ కి మరో సక్సెస్ ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. హాయ్ నాన్న తర్వాత తెలుగులో తన మూడో ప్రాజెక్ట్ 'ఫ్యామిలీ స్టార్' మూవీలో విజయ దేవరకొండ సరసన నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: