రాజమౌళి లాంటి ప్రముఖ దర్శకుడు నుండి ఒక దర్శకుడుకి ప్రశంసలు లభిస్తే ఆదర్శకుడి బ్రాండ్ వ్యాల్యూ విపరీతంగా పెరిగిపోతుంది. ఆమధ్య టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ రూపు రేఖలను మార్చిన దర్శకుల లిస్టులో రామ్ గోపాల్ వర్మ ముందువరసలో ఉంటాడు అంటూ జక్కన్న రామ్ గోపాల్ వర్మ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.


ఇప్పుడు రాజమౌళి ఏకంగా ‘యానిమల్’ దర్శకుడు సందీప్ వంగా పై విపరీతమైన ప్రశంసలు కురిపించడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఆమధ్య ఒక సామాజిక సేవా సంస్థ రాజమౌళి తో చేసిన ఇంటర్వ్యూతో అతడు అతడు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ ”కొత్త కొత్త డైరెక్ట‌ర్లు వ‌స్తారు పెద్ద సినిమాలు తీస్తారు అంటూ సినిమాకు సంబంధించి అన్ని  ఫార్ములాల‌ను ప‌క్క‌న పెట్టి నేను ఇలాగే సినిమా తీస్తాను అని చాటి చెప్పిన ద‌ర్శ‌కుల లిస్టులో సందీప్ రెడ్డి ప్రధమ స్థానంలో నిలుస్తాడు అంటూ అతడి పై విపరీతమైన ప్రశంసలు కురిపించి చాలమందిని ఆశ్చర్య పరిచాడు.


ఇదే సందర్భంలో ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన రణబీర్ కపూర్ ను ఆట పట్టిస్తూ అతడిని కార్నర్ చేయడానికి జక్కన్న ప్రయత్నించాడు.  ‘నీకు సందీప్ రెడ్డి వంగ అంటే ఇష్ట‌మా రాజమౌళి అంటే ఇష్టమా అని అడుగుతూ తాము ఇద్దరితోను సినిమా చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తావు’ అంటూ జక్కన్న రణబీర్ ను కార్నర్ చేయడానికి ప్రయత్నించాడు.


అయితే రాజమౌళి తెలివితేటలకు ఏమాత్రం షాక్ అవ్వని రణబీర్ మాట్లాడుతూ రోజుకు రెండు షిఫ్టుల్లో అటు రాజమౌళి సినిమాను ఇటు సందీప్ వంగా సినిమాను చేస్తానని చెప్పడంతో ఆ ఈవెంట్ కు వచ్చిన అతిధులు రణబీర్ కపూర్ తెలివితేటలకు ప్రశంసలు కురిపించినట్లు టాక్. అయితే రాజమౌళి ప్రశంసలు అందుకున్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సరైన సినిమాను తీయలేకపోతున్నాడు. అదేవిధంగా జక్కన్న ప్రశంసలు అందుకున్న సందీప్ వంగా ‘యానిమల్’ ఎలా తీశాడో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: