యానిమల్’ మ్యానియా తారా స్థాయికి చేరుకోవడంతో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్స్ ఓపెన్ అయిన వెంటనే హాట్ కేక్స్ లా అమ్ముడు పోతున్నాయి. ఈమూవీ తరువాత సందీప్ వంగా ప్రభాస్ తో ‘స్పిరిట్’ అన్న మూవీని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రారంభం అవ్వకుండానే ఈమూవీ పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.


రాబోయే సంవత్సరం షూటింగ్ ప్రారంభం అయ్యే ఈసినిమా 2025 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదలకాబోతోంది. ఈమూవీలో ప్రభాస్ పోలీసు ఆఫీసర్ గా నటించబోతున్నాడు. ఇప్పటివరకు ప్రభాస్ పోలీసు ఆఫీసర్ పాత్రను తన కెరియర్ లో ఎప్పుడు నటించని పరిస్థితులలో ప్రభాస్ పోలీస్ గెటప్ ను ఊహించుకుని అప్పుడే డార్లింగ్ అభిమానులు కలలు కంటున్నారు.


‘అర్జున్ రెడ్డి’ మూవీలో తన ప్రేయసి కోసం ఆరాటపడ్డ హీరో పాత్రను క్రియేట్ చేసిన సందీప్ వంగా ‘యానిమల్’ మూవీలో తండ్రి కోసం ఆరాటపడే కొడుకు పాత్రను క్రియేట్ చేశాడు. ఇప్పుడు రాబోతున్న ‘యానిమల్’ లో దీనికి భిన్నంగా డ్యూటీ కోసం హద్దులు దాటే ఆరాటం ఉన్న వ్యక్తిగా ప్రభాస్ పాత్రను తీర్చి దిద్దుతున్నట్లు టాక్. సందీప్ వంగా ఇప్పుడు వరకు తీసిన సినిమాలలో హీరో కుటుంబ నేపధ్యం ధనవంతులు అయితే ‘స్పిరిట్’ మూవీలో మాత్రం హీరో పాత్ర మధ్యతరగతి కుటుంబ నేపధ్యంలో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.


ఈమూవీని పాన్ ఇండియా మూవీగా సందీప్ వంగా తీయబోతున్న నేపధ్యంలో ఈమూవీలో అనేకమంది బాలీవుడ్ నటీనటులు నటించబోతున్నట్లు సమాచరం. అంచనాలకు అనుగుణంగా ‘యానిమల్’ బ్లాక్ బష్టర్ హిట్ అయితే ‘స్పిరిట్’ పై మరింత అంచనాలు పెరిగిపోతాయి. దీనితో ఈ మూవీ కథ పై సందీప్ రెడ్డి విపరీతమైన శ్రద్ద పట్టవలసి వస్తుంది. ఇది ఇలా ఉంటే రాజమౌళితో సినిమాను చేస్తున్న మహేష్ ఆమూవీని పూర్తి చేసిన తరువాత సందీప్ వంగా తో మరొక సినిమాను చేయడానికి అంగీకరించినట్లుగా వస్తున్న వార్తలు మహేష్ అభిమానులకు జోష్ ను ఇస్తుంటే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..  మరింత సమాచారం తెలుసుకోండి: