ఫహాద్ ఫాజిల్ ధూమం మూవీ థియేటర్లలో విడుదల అయిన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం నుంచి ఆపిల్ టీవీ ఓటీటీలో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ మూవీ ని కన్నడం, మలయాళంతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో ధూమం సినిమాను రిలీజ్ చేశారు. ధూమం సినిమాకు యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు.కేజీఎఫ్‌, కాంతార సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పాన్ ఇండియన్ లెవెల్‌లో అన్ని దక్షిణాది భాషల్లో ధూమం సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు.కానీ తెలుగు వెర్షన్ డబ్బింగ్ పనులు ఆలస్యం కావడం థియేటర్లలో రిలీజ్ కాలేకపోయింది.ఆ తర్వాత మలయాళం మరియు కన్నడ వెర్షన్స్‌కు నెగెటిట్ టాక్ రావడంతో తెలుగు వెర్షన్ రిలీజ్‌ను మేకర్స్ ఆపేశారు. తాజాగా డైరెక్ట్‌గా ఓటీటీలో తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేశారు. ధూమం సినిమాలో ఫహాద్ ఫాజిల్‌తో పాటు అపర్ణ బాలమురళి మరియు రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలను పోషించారు.ఈ చిత్ర కథ విషయానికి వస్తే సిగరెట్ తాగడం వల్ల తలెత్తే అనర్థాల్ని యాక్షన్ థ్రిల్లర్ కథతో డిఫరెంట్‌గా ధూమం సినిమాలో డైరెక్టర్ పవన్ కుమార్‌ చూపించాడు.. సిగరెట్ కంపెనీలో సేల్స్‌మెన్‌గా పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) ఓ  వ్యక్తి కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. అవినాష్‌ను అతడు బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటాడు.తన మాట వినకుంటే అవినాష్ భార్య దియా (అపర్ణ బాలమురళి) శరీరంలో ఫిక్స్ చేసిన మైక్రో బాంబ్‌ను పేల్చేస్తానని బెదిరిస్తాడు.. ఇంతకీ ఆ వ్యక్తి ఆ ఎవరు..అవినాష్‌ను అతడు ఎందుకు బెదిరిస్తాడు..ఆ వ్యక్తిని కనిపెట్టే సమయంలో అవినాష్ కి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది ఈ చిత్ర కథ.. థియేటర్స్ ఆకట్టుకోని ధూమమ్ మూవీ ఓటీటీ లో మెప్పిస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: