బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ యానిమల్ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే మొదటి రోజు డీసెంట్ టాక్ ని సొంతం చేసుకుంది.కానీ సెకండాఫ్  సినిమా కాస్త స్లోగా ఉంది. పైగా సెకండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ మరీ ఇబ్బందికరంగా ఉండటంతో మేకర్స్ ట్రిమ్ చెయ్యనున్నారు.ఏదేమైనా మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకునే కంటెంట్ అయితే ఇవ్వగలిగింది.ఇక ఈ సినిమా మొదటి రోజు ఖచ్చితంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటుందని ముందుగానే ఆ హడావుడి కనిపించింది. అయితే అంతకుమించి అనేలా మొదటి రోజు ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. గతంలో ఎప్పుడు లేనంత అత్యధిక స్థాయిలో ఈ సినిమా ఓపెనింగ్స్ అందుకుంది. దీంతో మరోవైపు సందీప్ రెడ్డి రేంజ్  ఈ సినిమాతో మరింత పెరిగింది అని చెప్పవచ్చు. ఇంకా అంతేకాకుండా అత్యధిక స్థాయిలో టాప్ కలెక్షన్స్ అందుకున్న హీరోగా కూడా రణబీర్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆది పురష్,జవాన్, పఠాన్ సినిమాల తర్వాత ఈ సంవత్సరం అత్యధిక స్థాయిలో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా యానిమల్ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.


ఇక ఈ వసూళ్లపై అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.ఫస్ట్ డే యానిమల్ సినిమా ఊహించని స్థాయిలో 116 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది అని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన చాలా రకాల విషయాలను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రణబీర్ క్యారెక్టర్ అన్ని వర్గాల ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక దానికి తగ్గట్టుగా సందీప్ రెడ్డి వంగా మేకింగ్ విధానం కూడా సినిమాకు మంచి బజ్ ని క్రియేట్ చేస్తోంది. మొదటి రోజు  సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా రెండవ రోజు కూడా అదే సత్తా చూపిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాతో రణబీర్ కపూర్ కు తెలుగు మార్కెట్లో కూడా మంచి వసూళ్లు వచ్చాయి. కేరళ తమిళనాడులో పెద్దగా కలెక్షన్స్ రాకపోయినప్పటికీ కర్ణాటక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న దాని కంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. రెండవ రోజు కూడా ఇదే తరహాలో సినిమా కలెక్షన్స్ అందుకుంటుందో లేదో.ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్టుతో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.ఇప్పుడు ఆమె విజయ్ దేవరకొండ క్లాతింగ్ బ్రాండ్ రౌడీ వేర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: