యానిమల్  మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్. ఎస్ రాజమౌళి, మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్ లో మల్లారెడ్డి బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఓ రేంజ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈవెంట్లో మల్లారెడ్డి మాట్లాడుతూ.." రణ్ బీర్ కపూర్ వినండి, రానున్న ఐదేళ్లలో తెలుగు వాళ్ళు బాలీవుడ్, హాలీవుడ్ ని ఏలుతారు. బాలీవుడ్ పనైపోయింది. ముంబై పాత బడిపోయింది. బెంగళూరు ఏమో ట్రాఫిక్ జామ్.  మీరు హైదరాబాద్ వచ్చేయండి.

 హైదరాబాద్ సిటీ దేశంలోనే గొప్పగా ఎదుగుతుంది. మా దగ్గర రాజమౌళి, దిల్ రాజు, సందీప్ వంగా లాంటి తెలివైన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం తెలుగు వారి అశ్వమేధ యాగం జరుగుతోంది" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ పై బాలీవుడ్ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మల్లారెడ్డి కామెంట్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ వంగా కి ప్రశ్న ఎదురైంది. మల్లారెడ్డి మాట్లాడినట్టు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు. బయట వ్యక్తులే అలా మాట్లాడుతుంటారు. రణబీర్ కపూర్ ని ఎదురుగా పెట్టుకుని ఆయన 

అలా మాట్లాడినప్పుడు మీకేమనిపించింది? అంటూ యాంకర్ ప్రశ్నించగా అందుకు సందీప్ రెడ్డి వంగా బదులిస్తూ.." బేసిగ్గా ఆయన ఎప్పుడూ అలాగే మాట్లాడతారు కదా. గతంలోనూ ఆయన వేరే స్పీచ్ లను నేను చూసాను. ఆయన ఎప్పుడూ అలానే మాట్లాడుతారు. ఆయన ఏజ్ అయిపోయింది. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా అవి మనకు ఎంత ఇబ్బంది కలిగించిన మనమేం చేయలేం" అంటూ చెప్పుకొచ్చాడు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భద్రకాళి పిక్చర్స్ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: