
అడపాదడపా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. పెద్దగా హిట్ కావడం లేదు. దీంతో నటనలో ఎంతో అనుభవం ఉన్న రాజశేఖర్ ని ఎంతోమంది డైరెక్టర్లు తమ సినిమాల్లో కీలక పాత్రల్లో వాడుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కొన్ని కథలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాయ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజు పాత్ర ఆయన చేయాల్సిందే. కానీ కాదనుకున్నారు. అయితే మొన్నటి వరకు దర్శకులు రాజశేఖర్ తీసుకోవాలంటే కాస్త భయపడేవారట. ఎందుకంటే ఆయన చెప్పిన టైంకి సెట్ కు రారని.. వచ్చిన సమయానికి షూటింగ్ పెట్టుకోవాలంటే పెత్తనం చెలాయించేవారని ఒక అపవాది కూడా ఆయన మీద ఉంది.
అయితే నితిన్ హీరోగా నటిస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కూడా రాజశేఖర్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం రాజశేఖర్ పూర్తిగా మారిపోయాడట. ఈ విషయాన్ని మూవీ టీం చెబుతుంది. ఏడింటికి షూటింగ్ అంటే ఏకంగా 6:30కే సెట్లో ఉంటున్నాడట రాజశేఖర్. ఆయన టైమింగ్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారట. ఇక ప్యాకప్ చెప్పే వరకు కూడా రాజశేఖర్ సెట్ లోనే ఉంటున్నారట. ఇక పారితోషకం విషయంలోనూ నిర్మాతలను పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదట. ఇక రాజశేఖర్ లో వచ్చిన మార్పును చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారట.