తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలోనే రెస్పాన్స్ అందుకొని పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ యాక్టింగ్ అలాగే తండ్రి కొడుకుల ఎమోషన్ తోపాటు సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బాగా హైలైట్ కావడంతో వీకెండ్ లో ఈ సినిమాకు మరింత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్  వచ్చాయి.అయితే మొదటిరోజు రివ్యూల పరంగా కొంత డివైడ్ టాక్ నడిచినప్పటికీ ఆ ప్రభావం అయితే సినిమాపై పెద్దగా పడలేదు. కంటిన్యూగా సినిమాకు చాలా ఏరియాలలో  హౌస్ ఫుల్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి.


ఇక ఈ వీకెండ్ లో యానిమల్ సినిమా మొత్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..ముందుగా  ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. స్టార్ నిర్మాత దిల్ రాజు యానిమల్ సినిమాను ఆంధ్ర తెలంగాణలో విడుదల చేశారు. ఇక మొత్తానికి 15 కోట్ల పెట్టుబడిని కేవలం రెండు రోజుల్లోనే వెనక్కి తెచ్చుకున్నారు. ఇక మూడవ రోజు నుంచి ఆయనకు ప్రాఫిట్స్ అనేవి రాబోతున్నాయి.శుక్ర శని ఆదివారంలో ఈ సినిమా హిందీలోనే ఎక్కువ  కలెక్షన్స్ అందుకుంది. సందీప్ రెడ్డి వంగ మొదటి సినిమా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ హిందీలో భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.


ఇక ఆ సినిమా క్రేజ్ తో పాటు రణబీర్ క్రేజ్ కూడా ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. దీంతో వీకెండ్ లో  ఈ సినిమాకు మొత్తంగా 176 కోట్లు హిందీ వెర్షన్ లోనే వచ్చాయి.ఈ రేంజ్ లో నెట్ కలెక్షన్స్ వస్తాయని అసలు ఎవరు ఊహించలేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యనిమల్ సినిమా ఆదివారం దాకా 360 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే అత్యధిక వేగంగా 300 కోట్లను అందుకున్న సినిమాగా యానిమల్ సినిమా నిలిచింది. అయితే ఈ సినిమాతో హీరోయిన్ రష్మిక మందన క్రేజ్ పెరగడం ఏమో గాని ట్రోల్స్ మాత్రం పెరుగుతున్నాయి. మొత్తానికి యానిమల్ సినిమా ఊహించిన దానికంటే బాక్సాఫీస్ వద్ద ఎక్కువ స్థాయిలోనే హడావిడి చేస్తోంది. ఇక సోమవారం నుంచి ఇంకా ఇలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: