రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ సినిమా డిసెంబర్ 1 విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే సత్తా చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారు ఆడియన్స్. ఇలాంటి తరుణంలో 'యానిమల్' మూవీ మహేష్ బాబు, రాజమౌళికి నచ్చలేదా? అనే ప్రశ్న టాలీవుడ్ ఆడియన్స్ మదిలో మెదులుతోంది. అందుకు కారణం ఈ ఇద్దరూ 'యానిమల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలే. ఈ ఈవెంట్ లో అటు మహేష్ ఇటు రాజమౌళి 'యానిమల్' మూవీని చూసేందుకు

 ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. రాజమౌళి అయితే టీజర్ చూసిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిన సినిమా ఇది అని భావించానని, డిసెంబర్ 1, 2 తేదీల్లో ట్రావెలింగ్ లో బిజీగా ఉండడంతో అంతకంటే ముందే అంటే నవంబర్ 30 ని ఈ సినిమా చూస్తానని అన్నారు. అంతేకాదు యానిమల్ సినిమా కోసం అప్పటివరకు తాను వెయిట్ చేయలేనని, అందుకే ప్రేక్షకుల కంటే ముందే చూస్తానని చెప్పాడు. ఆ తర్వాత మహేష్ బాబు మాట్లాడుతూ, అనిమల్ ట్రైలర్ చూసి మెంటల్ వచ్చిందని ప్రశంసలు కురిపిస్తూ.. ట్రైలర్లో ప్రతి ఆర్టిస్ట్ పని తీరును మెచ్చుకున్నాడు. వీళ్ళ మాటలను బట్టి కచ్చితంగా 'యానిమల్' రిలీజ్ అయిన ఫస్ట్ డే 

సోషల్ మీడియాలో మహేష్, రాజమౌళి ఈ సినిమాపై స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ఇద్దరూ సినిమా గురించి సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టు పెట్టలేదు. నచ్చితే చిన్న సినిమా అయినా సరే  ఆ సినిమా గురించి తన రివ్యూ ను పోస్ట్ చేసే మహేష్ బాబు యానిమల్ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు. దీంతో యానిమల్ మూవీ మహేష్ బాబు, రాజమౌళికి నచ్చలేదనే సందేహాన్ని కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం వాళ్లకు సినిమా నచ్చినా కూడా అందులో అడల్ట్ కంటెంట్ ఉండడంతో వాళ్లు రెస్పాండ్ అయితే ఎలాంటి వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుందో అని సైలెంట్ గా ఉండిపోయారని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: