ఈ వారం విడుదలకు రెడీగా ఉన్నా తెలుగు సినిమాలలో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న మూవీ లలో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఒకటి. ఈ మూవీ లో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి నితిన్ హీరోగా నటించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే వక్కంతం వంశీమూవీ కి దర్శకత్వం వహించగా ... తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. 

ఇకపోతే రాజశేఖర్మూవీ లో కీలకమైన పాత్రలో నటించడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని డిసెంబర్ 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను తాజాగా పూర్తి చేశారు. ఇక ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది.

ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా నితిన్ ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ఈ మూవీ లో ముఖ్యంగా కామెడీ మిమ్మల్ని చాలా ఆనందింప చేస్తుంది అని చెప్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: