అక్కినేని నాగార్జున నట వారసుడిగా జోష్ తో హీరోగా పరిచయమయ్యాడు నాగ చైతన్య. ఆ తర్వాత ఏమాయ చేసావే తో సూపర్ హిట్ అందుకున్నాడు. నటుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్న చైతూ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు చిత్రసీమలో నాగార్జున తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే కస్టడీ తో అడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం చందూ మోండేటీ దర్శకత్వంలో తండెల్ లో నటిస్తున్నారు. ఇందులో మరోసారి సాయి పల్లవి చైతూ సరసన నటిస్తుంది. అంతేకాకుండా.. ఇటీవల ధూత వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుపెట్టాడు చైతూ. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

నాగార్జున నటవారసుడిగా అడుగుపెట్టిన చైతూ తనకంటూ గుర్తింపు.. ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు చైతూ దాదాపు రూ.154 కోట్ల నికర విలువతో దక్షిణ భారత ల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఒకరిగా ఉన్నారు.. అతని లు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఒక్కో కు చైతూ.. రూ.10 నుండి 12 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అంతేకాకుండా బ్రాండ్ ఎండార్సర్‌గా భారీగానే వసూలు చేస్తారు. నివేదికల ప్రకారం.. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు 2 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

నాగ చైతన్య నటనతో పాటు తన సొంత క్లౌడ్ కిచెన్ బ్రాండ్ షోయును (Shoyu) ప్రారంభించడం ద్వారా ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. అభివృద్ధి చెందుతున్న ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ప్రవేశించి.. హైదరాబాద్ ఆహార ప్రియులకు పాన్- ఆసియన్ వంటకాలను అందిస్తూ వ్యాపార రంగంలో సక్సెస్ అయ్యాడు. ఇవే కాకుండా.. హైదరాబాద్‌లోని సంపన్న జూబ్లీహిల్స్ పరిసరాల్లో తన తండ్రి ఇంటికి సమీపంలో ఒక విలాసవంతమైన బంగ్లాను కూడా కొనుగోలు చేశాడు.అలాగే చైతూకు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు అతని వద్ద దాదాపు రూ. 1.75 కోట్ల విలువైన ఫెరారీ ఎఫ్ 430, రూ. 3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఉన్నాయి. అలాగే రూ. 19 లక్షల విలువైన bmw R9T, సుమారు రూ. 13 లక్షల ఖరీదు చేసే ట్రయంఫ్ థ్రక్స్‌టన్ R వంటి సూపర్‌బైక్‌లను కలిగి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: