ఈ పాటలను కూడా పలు రకాల ప్రాంతాలలో షూట్ చేశామని అలాగే థిస్ ఇస్ లేడీస్ రోజ్ అనే పాట రాజకుమారితో పాడించామంటూ ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది అంటూ సంగీత దర్శకుడు సైతం తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్ సపోర్టు ఉంటే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని చెప్పవచ్చు ఈ విషయంలో కెమెరామెన్ సౌందర్ య రాజన్ గారు ప్రాణం పెట్టి మరి పని చేశారని చెప్పవచ్చు.
సెకండ్ హాఫ్ లో ఒక ముఖ్యమైన యాక్షన్స్ సన్ని వేశాలలో కళ్యాణ్ రామ్ గారు చాలా నట విశ్వరూపాన్ని చూపించారంటూ తెలియజేశారు.ఈ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు రావచ్చు అంటూ కూడా తన ఉద్దేశంగా తెలియజేశారు హర్షవర్ధన్. తను మాట్లాడుతూ భవిష్యత్తులో డైరెక్షన్ చేసే అవకాశం ఉందని ఇద్దరు గిటార్స్ మాత్రమే ఉండేలా ఒక ప్లాన్ చేస్తున్నానని తెలిపారు యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో చాలా అవకాశాలు వస్తున్నాయని ప్రస్తుతం అవన్నీ చర్చల దశలో ఉన్నాయంట తెలిపారు. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమాకి కూడా తానే సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఇది వచ్చే ఏడాది లో ప్రారంభమవుతుందని హర్షవర్ధన్ తెలియజేయడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి