మెగా హీరోల్లో ఒకడైన వరుణ్ తేజ్.. మరో రెండు రోజుల్లో ఆపరేషన్ వాలెంటైన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇండియన్ ఎయిర్ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో పవర్ ఫుల్ వైమానిక దళ అధికారిగా వరుణ్ తేజ్ కనిపించనున్నారు. ఈ సినిమా ఏకంగా 40 కోట్లపైగా బడ్జెట్ తో తెరకెక్కి వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా నిలిచింది.ఇక హైడోస్ యాక్షన్ విజువల్స్ ఉన్న ట్రైలర్.. ఈ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేసింది. మార్చి 1వ తేదీన ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇక భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించాలనుకుంటే పొందాల్సిన అన్ని అనుమతులను రక్షణ శాఖ నుంచి ఆపరేషన్ వాలెంటైన్ మేకర్స్ తీసుకున్నారు. ఇప్పటి దాకా పుల్వామా దాడి ఆధారంగా 16 మూవీ స్క్రిప్టులు రాగా.. కేవలం వరుణ్ సినిమాకు మాత్రమే పర్మిషన్ దక్కింది. రక్షణ శాఖ తెలిపిన నిబంధనలన్నిటిని కూడా ఈ మూవీ మేకర్స్ పాటించారు. ఇక అధికారుల మద్దతుతో గ్యాలియర్ లో 40 రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు.అయితే ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ మూవీపై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మూవీ పుల్వామా దాడి తర్వాత భారత వైమానిక దళం తీర్చుకున్న ప్రతీకారం చుట్టూ తిరుగుతుంది.


సాధారణంగా పాకిస్థాన్ను యాంటీగా చూపించే సినిమాలు గల్ఫ్ దేశాలు ప్రోత్సహించవు, ప్రదర్శించవు. ఎందుకంటే అవి ముస్లిం దేశాలు కాబట్టి.రీసెంట్ గా హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్ తో పాటు యామీ గౌతమ్ లీడ్ రోల్ లో చేసిన ఆర్టికల్ 370 మూవీపై కూడా గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించడం జరిగింది.ఇక ఈ రెండు సినిమాలు కూడా బాలాకోట్ దాడులను ప్రస్తావించినందుకే నిషేధాన్ని ఎదుర్కొన్నాయి.ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ కూడా ఇదే అంశాన్ని మరింత వివరంగా అలాగే సరైన రీతిలో చూపిస్తుంది. అందుకే ఈ సినిమాని కూడా గల్ఫ్ దేశాలు నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వరుణ్ తేజ్ నటించిన రెగ్యులర్ తెలుగు సినిమా అయ్యి ఉంటే ఈ చిక్కులు వచ్చేవి కావు.హిందీ, తెలుగులో ద్విభాషా సినిమాగా ఆపరేషన్ వాలెంటైన్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా నిర్మించింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్.. ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ సినిమా .. శుక్రవారం విడుదల కానుంది. మరి ఆపరేషన్ వాలెంటైన్ సినిమా  వరుణ్ తేజ్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: