తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఇకపోతే ఈయన తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో హీరో గా నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే హీరో గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న చైతన్య కొంత కాలం క్రితం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన దూత అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది నాగ చైతన్య కు మొట్ట మొదటి వెబ్ సిరీస్ కాగా ... దర్శకుడు విక్రమ్ కే కుమార్ కి కూడా ఇదే మొట్ట మొదటి వెబ్ సిరీస్ కావడం విశేషం. వీరిద్దరి కెరియర్ లో ఇదే మొట్ట మొదటి వెబ్ సిరీస్ కావడంతో మొదటి నుండి ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సీరీస్ లో ప్రియ భవాని శంకర్ , నాగ చైతన్య కు భార్య పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

అలాగే ఇందు.లోని నటనకు గాను నాగ చైతన్య కు ... ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన విధానానికి గాను విక్రమ్నకే కుమార్ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఇంతలా ప్రేక్షకులను అలరించిన ఈ వెబ్ సిరీస్ కు సీజన్ 2 ను కూడా ఈ వెబ్ సిరీస్ బృందం ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 సంబంధించిన కథ చర్చలు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. ఇకపోతే రేపు అనగా మార్చి 19 వ తేదీన దూత సీజన్ 2 కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: