ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టామ్ హీరోగా కొనసాగుతున్నాడు మహేష్ బాబు. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కథల విషయంలో ఎంతో జాగ్రత్త పడుతూ వరుసగా సూపర్ హిట్లు కొడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమాతో మహేష్ బాబు కెరియర్ ఒక్కసారిగా టర్ను తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన మహేష్ అప్పటి వరకు లవర్ బాయ్గా క్రిష్ తెచ్చుకుని.. పోకిరి తర్వాత మాస్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి.


 అయితే పోకిరి సినిమా ముందు వరకు కూడా కేవలం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ వచ్చాడు మహేష్ బాబు. అయితే చాలామంది హీరోల కెరియర్ లో కొన్ని సినిమాలు మొదట ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం చూస్తూ ఉంటాం. అయితే మహేష్ బాబు కెరీర్ లో కూడా ఇలాంటి మూవీ ఒకటి ఉంది అని చెప్పాలి. మొదట విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
సినిమా ఏదో కాదు మురారి.


 ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అన్న విషయం తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో 2001 ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ చేయడానికి మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదట. ఇలాంటి సినిమాల్లో నటిస్తే క్రేజ్ తగ్గుతుందని అన్నారట. కానీ మహేష్ బాబు బలవంతంగా ఈ సినిమాలో నటించారట. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే సినిమా చూసి ఎంతగానో నిరాశ చెందారట. దీంతో ఈ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగింది. స్టోరీ బాగుండడమే కాదు దానికి తోడు మహేష్ యాక్టింగ్ కూడా అదిరిపోవడంతో ఇక మొదట ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: