40 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు దీటుగా సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది హీరోయిన్ త్రిష. ప్రతి ఏడాది కూడా ఏదో ఒక సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంటూ ఉన్నది.. పోన్నియన్ సెల్వన్ సినిమా తో రియంట్రి ఇచ్చి తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది త్రిష. ఈ సినిమా దాదాపుగా రూ .1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత.. లియో సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం త్రిష చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.


అజిత్ తో ఒక సినిమా మోహన్లాల్ తో ఒక సినిమా చిరంజీవి విశ్వంభర సినిమాతో పాటు సౌత్ ఇండియాలోనే ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతోంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యూనికేషన్ తీసుకుంటున్న నటి గా కూడా త్రిష సంపాదించింది త్రిష.. ప్రస్తుతం ఒక చిత్రానికి రూ .12 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం.. దక్షిణాది నటిగా ఒకో చిత్రానికి రూ .10 కోట్లకు పైగా అందుకోవడం ఇదే మొదటిసారి అని కూడా చెప్పవచ్చు.


ఇప్పుడు త్రిష అందుకుంటున్న రెమ్యూనరేషన్ దక్షిణాది భారతదేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ విషయాన్ని ఎన్నో మీడియా సంస్థలు కూడా ఇటీవలే ప్రకటించాయి.. 2010లో అక్షయ్ కుమార్ తో త్రిష బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా గోరంగా ఫ్లాప్ అయింది. దీంతో ఆమె దృష్టి మొత్తం తెలుగు తమిళ ఇండస్ట్రీ వైపే పెట్టింది.. అందుకే ప్రస్తుతం పలు సినిమాలలో హీరోయిన్స్ గా నటిస్తూ ఉండడమే కాకుండా యంగ్ హీరోయిన్స్ కు కూడా 40 ఏళ్ల వయసులో పోటీ ఇస్తూ  తనకంటూ ఒక బ్రాండ్ ని ఏర్పరచుకుంది త్రిష. ప్రస్తుతం త్రిష రెమ్యూనరేషన్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: