మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గోపిచంద్ సరసన ప్రియా భవానీ శంకర్‌ మరియు మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలో విడుదల కాబోతుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 05నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌ పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించగా.. 'సలార్‌' ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందించాడు.

సినిమా కథ విషయానికి వస్తే.. అది కర్ణాటకలోని పరశురామ క్షేత్రం- మహేంద్రగిరి. ఆ ప్రాంతంలో దివ్యఔషధ గుణములుండే మొక్కలు వుంటాయి. అలాగే ఓ మహిమ గల శివాలయం కూడా వుంటుంది. చనిపోయిన వారి చివరి కోరిక న్యాయ బద్దమైనదైతే, ఆ శివాలయంలో పూజలు చేస్తే ఆ కోరిక తీరుతుంది. అయితే అనూహ్యంగా ఆ గుడిని మూసివేయాల్సి వస్తుంది. సరిగ్గా ఐదు దశాబ్దాల తర్వాత అదే ఊరికి పోలీస్ ఇన్స్పెక్టర్ గా భీమా (గోపీచంద్) వస్తాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి..ఆ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న రౌడీ భవాని కి హీరో ఎలా బుద్ధి చెప్పాడు..ఈ కథలో రవీంద్ర వర్మ( నాజర్) పాత్ర ఏమిటి.. మూతపడిన గుడికి భీమాకి వున్న సంబంధం ఏమిటి.. అనేది ఈ మూవీ కథ.. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల్ని అయిన మెప్పిస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: