బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బిగ్ బాస్ గేమ్ షోతో  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివి అంతకు ముందు పలు సినిమాలల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా లో మహేష్ ఫ్రెండ్ గా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించింది.బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన ఫ్యాన్ బేస్ పెంచుకున్న ఈ భామ బిగ్ బాస్ తర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంది..మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ మూవీ లో ఈ భామ కీలక పాత్ర లో నటించింది. అలాగే హీరోయిన్ గా పలు క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది.

భామ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ లంబసింగి.అందమైన ప్రేమ కథతో పాటు ఆసక్తి  ట్విస్ట్ లతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో ఆశించిన స్థాయి లో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో దివి ఎంతో యాక్టివ్ గా పాల్గొంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా మెప్పించలేకపోయింది..ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది..లంబసింగి మూవీ మార్చి 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది..థియేటర్స్ లోకి వచ్చిన కేవలం రెండు వారాల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. లంబసింగి మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది.. లంబసింగి మూవీ ఏప్రిల్ 2 నుంచి హాట్‌స్టార్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రాబోతుంది.ఓ పోలీస్ కానిస్టేబుల్,ఓ నక్సలైట్ కూతురు మధ్య సాగే ప్రేమ కథ తో ఈ మూవీ తెరకెక్కింది.మరి థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: