ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఒకటి. ఈ బ్యానర్ లో సూర్య దేవర నాగ వంశీ ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం ఎన్నో మూవీ లను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరం ఈ బ్యానర్ నుండి రెండు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో మొదటగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం సినిమా థియేటర్ లలో విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది.

ఇకపోతే మార్చి 29 వ తేదీన ఈ బ్యానర్ నుండి టిల్లు స్క్వేర్ అనే మూవీ జనాల ముందుకు వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని ఇప్పటికి కూడా థియేటర్ లలో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా 125 ప్లస్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇంత సక్సెస్ ఫుల్ బ్యానర్ గా కొనసాగుతున్న ఈ సంస్థకు సంబంధించి కొన్ని అబద్ధపు ప్రచారాలు ఈ మధ్య బయటకు వస్తున్నాయి. వాటి గురించి తాజాగా ఈ బ్యానర్ అధినేత అయినటువంటి నాగ వంశీ తాజాగా తెలియజేశాడు.

తాజాగా నాగ వంశీ ఓ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... మేం నిర్మించే మరియు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలకు సంబంధించిన ఏవైనా విషయాలను చెప్పాలి అనుకుంటే మేము అఫీషియల్ గా వాటిని అనౌన్స్ చేస్తాం. దయచేసి వదంతుల్ని ఏ మాత్రం నమ్మకండి అని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమా హక్కులను సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దాని గురించే నాగ వంశీ ఈ విధంగా స్పందించాడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

nv