ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుల్లో  రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో  క్యారెక్టర్ ఆర్టిస్టుగా  చేసి చాలా చిత్రాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఈయన సినిమాల్లో ఎక్కువగా కామెడీ సినిమాలు ఉండడం గమనార్హం. అలా కొన్నాళ్లపాటు హీరోగా రాణించిన రాజేంద్రప్రసాద్ మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాలు చేశారు. అలా ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ నటుడిగా పేరుపొందిన రాజేంద్రప్రసాద్  ఈ మధ్యకాలంలో చాలా చిత్రాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొంటూ చాలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుతున్నారు. అయితే తాజాగా ఆయన  నటించిన షష్టిపూర్తి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారట. అయితే ఈ ప్రోగ్రాంలో ఇళయరాజా కూడా పాల్గొనడం  హైలెట్ అయింది. 

ఈ సందర్భంగా హీరో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు ఇళయరాజాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అయితే ఈయన తను నటించిన ప్రేమించు పెళ్ళాడు చిత్రానికి మొదటిసారి సంగీతం అందించారట. అయితే సినిమా సంగీతంగా ప్రకారం ఎంతో హిట్ అయినా కానీ కథ ప్రకారం చూస్తే ఫ్లాప్ అయిపోయిందట. దీంతో రాజేంద్రప్రసాద్  ఇక నేను సినిమాలకు పనికిరాను అనుకుంటూ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట.. అయినా ఆయన ధైర్యం చేసి మరో చిత్రం లేడీస్ ట్రైలర్ లో నటించారు. దీనికి కూడా ఇళయరాజా సంగీతమే అందించారు. అయితే ఈ సినిమా భారీ బంపర్ హిట్ అయింది. రాజేంద్రప్రసాద్ కెరీర్ నే మార్చేసిందని చెప్పవచ్చు.

 అయితే ఈ సినిమా గనక హిట్ కాకపోతే రాజేంద్రప్రసాద్ ఫోటోకి ఇప్పటివరకు దండపడేదని నేను తప్పకుండా మరణించేవాడినని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆ సినిమా హిట్ కొట్టి నన్ను హీరోగా నిలబెట్టిందని ఆయన అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఈ సినిమా రీ రికార్డింగ్ సమయంలో ఇళయరాజా రేయ్ నువ్వు ఈ చిత్రంలో చాలా బాగా చేశావు.. మరి నువ్వు గెలుస్తావా నా సంగీతం గెలుస్తుందా అంటూ ఇద్దరూ బెట్ కట్టుకున్నారట. కానీ ఈ సినిమా సంగీతం, కథ, నటనపరంగా అన్ని రకాలుగా సూపర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: