నాచురల్ స్టార్ నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటించగా ... శైలేష్ కోలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన యూ ఎస్ ఏ ప్రీమియర్స్ ను ఏప్రిల్ 30 వ తేదీన ప్రదర్శించరున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూ ఎస్ ఏ టికెట్ బుకింగ్స్ లను కూడా ఈ మూవీ బృందం వారు ఓపెన్ చేశారు. ఈ మూవీ యూ ఎస్ ఏ టికెట్ బుకింగ్లకి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఇప్పటికే ఈ మూవీ కి యు ఎస్ ఏ లో ప్రీమియర్ సేల్స్ ద్వారానే ఈ 100 కే ప్లస్ కలెక్షన్స్ వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ మరియు హిట్ ది సెకండ్ కేస్ మూవీలు మంచి విజయాలు సాధించి ఉండడం , ఇప్పటి వరకు హిట్ ది థర్డ్ కేస్ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో హిట్ ది థర్డ్ కేస్ మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం నానిమూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: