కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న వారిలో సూర్య ఒకరు. ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో సూర్య కు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది. కొంత కాలం క్రితం సూర్య "కాంగువ" అనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ అనేక భాషలలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలం అయింది.

దానితో ఈ మూవీ ద్వారా సూర్య కు భారీ అపజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. తాజాగా సూర్య , కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రేట్రో అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని మే 1 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాల ద్వారా ఈ మూవీ ఒక యాక్షన్ సినిమా అని చాలా మంది భావించారు. ఇక ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ రావడంతో ఇది యాక్షన్ మూవీ అని జనాలు కూడా పక్క క్లారిఫికేషన్ కి వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: