టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల క్రితం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన దేశముదురు అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో హన్సిక హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయం సాధించడం , ఇందులో హన్సిక తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

ఇకపోతే చక్రిమూవీ కి సంగీతం అందించాడు. చక్రి అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ ని 2007 వ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. 2007 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కు అద్భుతమైన క్రేజ్ కూడా వచ్చింది. ఇకపోతే 2007 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన ఈ సినిమాను మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ ని మే 10 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోలు నటించిన అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మరి దేశముదురు సినిమా రీ రిలీజ్ లో భాగంగా బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa