సాధారణంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు  ఏది చెప్పినా మిగతా జనాలు అభిమానులు పాటిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో వచ్చే చాలా సినిమాలు ఇప్పుడున్న యువతపై ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఎంతో మంది యువత  హీరోలాగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోలు హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వీరు ఏదైనా చిన్న మెసేజ్ పెడితే జనాల్లోకి ఇట్టే వెళ్లిపోతుంది. ఇంత పెద్ద స్టార్ డం ఉండి దేశంలో జరుగుతున్నటువంటి విపత్తుల మీద కొంతమంది నటీనటులు స్పందించడం లేదు. కొన్ని అడ్డమైన విషయాలపై స్పందించే కొంతమంది నటీనటులు దేశంలో  ఉగ్రవాదుల చేతిలో ఎంతోమంది అమాయకులు బలైతే కనీసం స్పందించి వారికి నివాళులర్పించే టైం కూడా లేకుండా పోతుంది. కొంతమంది స్టార్లు తప్ప మిగతా వారెవరు కూడా  ఉగ్రదాడిలో అసువులు బాసిన వారి గురించి కనీసం ఒక మెసేజ్ కూడా పెట్టలేదు. అంటే వీరికి దేశం గురించి కానీ దేశంలో జరుగుతున్నటువంటి విపత్తుల గురించి కానీ ఏమాత్రం అవసరం లేదు.

 కేవలం సినిమా తీసామా..జనాల జేబులు కత్తిరించామా.. డబ్బులు సంపాదించామా అనే విధంగా మాత్రమే చూస్తున్నారనిపిస్తోంది. వీళ్ళకి గనక దేశం మీద ప్రేమ ఉంటే తప్పకుండా ఇలాంటి విషయాల్లో స్పందించి అందులో వారికి సహకారం కూడా అందిస్తారు. కానీ అవేవి చేయకుండా మాకెందుకులే అన్నట్టు ఉన్న హీరోలను మనమందరం ఏమని పిలవాలి.. అంటే వారికి దేశంపై దేశంలో ఉన్న సమస్యలపై బాధ్యత లేదా.. అలాంటి బాధ్యత లేనప్పుడు సినిమాలు తీసుకొని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి మన దేశ ప్రజల సొమ్ము తినే హక్కు కూడా వారికి లేదని కొంతమంది మేధావులు అంటున్నారు. మేం పెద్ద హీరోలం మా ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది అని అనుకునే కొంత మంది హీరోల కంటే ఆ చిన్న హీరోయినే చాలా బెటర్ అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అంటున్నారు.

కానీ ఇలాంటి విపత్తులపై ఆ చిన్న హీరోయిన్ తప్ప కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఏ హీరో హీరోయిన్ మాత్రం స్పందించడం లేదు. ముఖ్యంగా తెలుగు నటి అయినటువంటి అనన్య నాగళ్ళ చేసేది చిన్న సినిమాలైన ఎప్పుడూ మానవతా దృక్పథంతోనే స్పందిస్తోంది. ఆ మధ్య విజయవాడలో వరదలు వస్తే అక్కడికి వెళ్లి పరిశీలించి తనకు తోచిన సహకారం అందించింది. తాజాగా ఉగ్ర దాడిలో మృతి చెందినటువంటి వ్యక్తి ఏపీలోని కావలి  చెందిన వ్యక్తి అని తెలిసి నెల్లూరులో ఓ ఈవెంట్ కి వెళ్లి అక్కడి నుండి కావలిలోని వాళ్ళింటికి వెళ్లి పరామర్శించి వారికి ఆర్థిక భరోసా అందించింది. ఈమె తప్ప మిగతా  నటీనటులు ఎవరు ఉగ్ర దాడిలో బాధితులైనటువంటి వారిపై సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడం బాధాకరమని సినీ మేధావులు మండిపడుతున్నారు.( చిరంజీవి లాంటి స్పందించిన నటినటుల గురించి కాకుండా స్పందించని  హీరో హీరోయిన్ ల గురించి మాత్రమే ఇది రాయబడింది ).

మరింత సమాచారం తెలుసుకోండి: