నాచురల్ స్టార్ నాని తాజాగా హిట్ ది తెడ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను ఈ మూవీ బృందం వారు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు ఏప్రిల్ 27 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను JRC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు.

ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే హిట్ అది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీలు మంచి విజయాలను సాధించి ఉండడం , నాని కూడా వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉండడంతో హిట్టు ది థర్డ్ కేస్ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. నాని ఇప్పటికే ది ప్యారడైజ్ అనే సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించబోతున్నాడు. హిట్ 3 సినిమా విడుదల అయిన తర్వాత ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ను మొదలు పెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: