
"రాజధాని రైతులకు కుటుంబ సమేతంగా ప్రత్యేక ఆహ్వానం" అంటూ ముద్రించిన ఈ ఆహ్వాన పత్రికలొ మోదీ, చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేశ్ లకు ప్రాధాన్యత దక్కింది. ప్రభుత్వం ఇచ్చిన వాణిజ్య ప్రకటనలలో నారాయణకు సైతం చోటు దక్కి ఉంటే బాగుండేదని ప్రస్తుతం నారాయణ మంత్రిగా కూడా ఉన్నారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
నారాయణకు ఈ విధంగా ఘోర అవమానం జరుగుతుందని ఎవరూ ఊహించలేదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే తనకు చోటు దక్కకపోవడం గురించి నారాయణ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి సైతం ఆహ్వాన పత్రికలో ప్రాధాన్యత దక్కలేదు. అయితే చంద్రబాబు ఏ పని చేసినా ఏదో ఒక వ్యూహం ఉంటుంది.
అమరావతి కోసం ఎంతో కృషి చేసిన నారాయణను పక్కన పెట్టడంపై టీడీపీ శ్రేణుల్లో సైతం ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అమరావతి అభివృద్ధి కార్యక్రమంలో నారాయణను విమర్శించడం వల్ల పార్టీ భవిష్యత్తుకు సైతం తీరని నష్టం చేకూరే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. వెలగపూడిలో జరిగే ఈ చారిత్రాత్మక వేడుకలో మోదీ ఏపీకి మేలు జరిగేలా ఏవైనా ప్రకటనలు చేస్తారేమో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు