సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అతడు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి త్రిష హీరోయిన్గా నటించగా ... సోను సోద్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ప్రకాష్ రాజ్ , నాజర్ , బ్రహ్మానందం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర కంటే కూడా బుల్లి తెరపై ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇప్పటికి కూడా ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయింది అంటే మంచి టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళ్తే ... ఈ మధ్య కాలంలో అనేక సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మన తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన చాలా సినిమాలను కూడా ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ చేశారు. అలాగే మహేష్ బాబు హీరోగా రూపొందిన అనేక సినిమాలు కూడా ఇప్పటికే రీ రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా అతడు మూవీ బృందం వారు అతడు సినిమాను మరో 100 రోజుల్లో అనగా ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: