సినీ ఫీల్డ్ లో హీరోయిన్స్ రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారి స్టార్ స్టేటస్ పడిందంటే దాన్ని కాపాడుకోవడానికి  చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంత కష్టపడ్డా హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించడం కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత కొత్త కొత్త  హీరోయిన్స్ వస్తుంటారు. దీంతో పాత హీరోయిన్స్ కి ఆదరణ తగ్గుతుంది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలా వచ్చి ఇలా స్టార్ గా ఎదిగిన హీరోయిన్ లలో శ్రీలీల ఒకరని చెప్పవచ్చు.. పెళ్లి సందD అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ సినిమా ఓ మోస్తారు హిట్ అయినా కానీ తన నటనా టాలెంట్ తో అందరి దృష్టిలో పడింది. ఎంతో చిన్న వయసులోనే స్టార్ హీరోలు అందరితో జతకడుతూ  మంచి పొజిషన్ లోకి వెళ్తోంది. అలాంటి ఈమె పుష్ప -2 సినిమాలో కిస్సిక్  అనే ఐటమ్ సాంగ్ చేసి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సాధించింది. 

కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా హిందీ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంటుంది. ఓవైపు డాక్టర్ ఫీల్డ్ పూర్తి చేసిన శ్రీ లీల సినీ ఫీల్డ్ లో కూడా తనకు ఎదురు లేదు అనిపించుకుంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాలే కాకుండా లవ్ విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేసింది అని చెప్పవచ్చు. అయితే ఈమె బాలీవుడ్ హీరో తో లవ్ లో పడిందని, ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు కూడా తెలుసని  అర్థమవుతుంది. ఆ హీరో ఎవరో ఆ వివరాలు చూద్దాం.. శ్రీలీల బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో లవ్ లో పడిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. అయితే ఈ యువ హీరోయిన్  యువ నటుడు కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ముంబైలో జరిగినటువంటి వేవ్స్ 2025 ఈవెంట్ లో శ్రీలీల రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అయితే ఈమె కార్తీక్ ఆర్యన్ తల్లితో కలిసి ఆ ఈవెంట్ కి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో  కార్తీక్ ఆర్యన్ తల్లిని ఒక రిపోర్టర్ మీరు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు అని అడగగా..  మా ఇంటి కోడలు గా ఓ డాక్టర్ రావాలని కోరుకుంటున్నాను అని సమాధానం ఇచ్చింది. దీంతో  శ్రీలీలనే ఆమె కోడలిగా చేసుకోబోతుందని అందరికీ అర్థం అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: