పాపం..హీరోయిన్ పూజ హెగ్డే ఫుల్ శని దశలో ముందుకు వెళుతున్నట్లు ఉంది.  అందుకే కాబోలు ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన "రెట్రో" సినిమా ఫ్లాప్ అయ్యింది . ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ తో పూజ హెగ్డే పై జాలిగా మాట్లాడుతున్నారు జనాలు . పూజా హెగ్డే అంటే ఒకప్పుడు బుట్ట బొమ్మగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా ఏ ఈవెంట్ కి వెళ్ళిన ఏ షాప్ ఓపెనింగ్ ఫంక్షన్ కి వెళ్లినా బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ అంటూ సాంగ్ ప్లే చేసి మరి ఆమెను పోగిడేసేవారు .


అయితే ఇప్పుడు మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది . హీరోయిన్ పూజా హెగ్డే కి అవకాశాలు ఇవ్వడానికే భయపడిపోతున్నారు డైరెక్టర్లు . తెగించి డైరెక్టర్లు ఆమెకు అవకాశాలు ఇచ్చినా సరే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది.  రీసెంట్గా ఆమె నటించిన రెట్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది . సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకున్నాక కచ్చితంగా ఆమె లైఫ్ జిల్ జిల్ జిగా అయిపోతుంది అంటూ అంతా అనుకున్నారు. అయితే సూర్యతో నటించిన "రెట్రో" సినిమా ఫ్లాప్ అయ్యింది.  దీంతో పూజ హెగ్డే ఖాతాలో మరో బిగ్ ఫ్లాప్ సినిమా పడినట్లు అయ్యింది.



హిట్ సినిమా పడితే వెంట వెంట వెంటనే ఆఫర్స్ ఇచ్చే డైరెక్టర్ ఫ్లాప్ సినిమా పడితే వెంటనే ఇచ్చిన ఆఫర్ ని  వెనక్కి తీసుకుంటారు.  ప్రజెంట్ అలాగే చేశాడు ఒక తెలుగు డైరెక్టర్ అంటూ న్యూస్ తెరపైకి వచ్చింది.  పూజ హెగ్డే సూర్య సినిమాలో నటిస్తుంది అని తెలియగానే ఈ సినిమా హిట్ అవుతుంది అని పూజా హెగ్డే తలరాత మారిపోతుంది అంటూ ముందుగానే ఓ సినిమాకి  కమిట్మెంట్ తీసుకున్నారట తెలుగు డైరెక్టర్ . అయితే ఇప్పుడు ఆ తెలుగు డైరెక్టర్ పూజ హెగ్డే తో సినిమా వద్దు అంటూ ఇచ్చిన అడ్వాన్స్ కూడా మర్చిపోతాను అగ్రిమెంట్ క్యాన్సిల్ అంటూ చేతులెత్తేసాడట. దీనికి సంబంధించిన న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హల్చల్ చేస్తుంది . పూజ హెగ్డే కు టైం పూర్తిగా బ్యాడ్ దశలో నడుస్తుంది అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: