
ఈమూవీ ప్రాజెక్ట్ ను రాజమౌళి ఆద్వర్యంలో కార్తికేయ వరుణ్ గుప్తా లు కలిసి నిర్మిస్తారని ఆకథనం సారాంశం. ఇప్పటికే ఈ బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశాడని ఈస్క్రిప్ట్ తారక్ కు బాగా నచ్చడంతో అతడు ఈమూవీలో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ బాలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది.
వాస్తవానికి దాదా ఫాల్కే జీవితం ఎన్నో మలుపులతో కూడుకుని ఉన్నది. 1870 లో పుట్టిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతదేశపు మొదటి సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ కు నిర్మాత దర్శకుడుగా వ్యవహరించారు. ఆతరువాత 95 సినిమాలను తీసిన ఘన చరిత్ర ఆయనకు ఉంది. తన ఆస్థులు అన్నీ అమ్మి సినిమాలు తీసిన ఈయన తన జీవితంలో చేసిన సాహసాలలో అతడి భార్య సరస్వతీ బాయ్ ఇచ్చిన ప్రోత్సాహం చాల ఎక్కువగా ఉంది అని అంటారు. ఇంత గొప్ప మనిషి జీవితం చివరి దశలో డబ్బు లేకుండా గడిచిపోయింది. చనిపోవడానికి ఆరు సంవత్సరాల ముందు వరకు ఆయనకు స్వంత ఇల్లు లేదు. అదే ఇంట్లో అనారోగ్యంతో కన్ను మూశారు.
ఇప్పటి తరానికి ఏమాత్రం పరిచయంలేని ఆయన జీవితంలో ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి. ఇండియన్ సినిమా ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి దాదాసాబ్ చేసిన త్యాగాలు ఎన్నో. అటువంటి గొప్ప వ్యక్తి మీద రాజమౌళి ఆద్వర్యంలో సినిమా తీయడం వార్తలు వాస్తవం అయితే అది ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక అద్భుతమైన సినిమాగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహంలేదు..