నారా భువనేశ్వరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ చెల్లెలిగా నారా చంద్రబాబు నాయుడు సతీమణిగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. నారా భువనేశ్వరి తన సోదరుడు బాలకృష్ణతో ఎంతో ప్రేమగా ఉంటుంది. అంతేకాకుండా బాలకృష్ణ కూతురుని తన ఇంటి కోడలిగా కూడా చేసుకుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం నారా భువనేశ్వరి ప్రతిసారి కావాలనే దూరం పెడుతుంది. ఈ విషయానికి సంబంధించి గతంలోనే అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం ఉందని క్లియర్ గా అర్థమైంది.


 
నారా కుటుంబంలో మరియు చంద్రబాబు కుటుంబాలలో ఎలాంటి ఫంక్షన్లు, పార్టీలు జరిగిన అందరూ హాజరవుతారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వీరి ఫంక్షన్లకు అస్సలు వెళ్ళరు. దానికి గల కారణం ఎన్టీఆర్ కుటుంబాన్ని వీరు ఆహ్వానించకపోవడమే అని గతంలో అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా హరికృష్ణ మొదటి భార్యను నారా భువనేశ్వరి గోరంగా అవమానించింది. ఓ కార్యక్రమానికి హరికృష్ణ మొదటి భార్య హాజరు అయ్యారు. ఆ సమయంలో నారా భువనేశ్వరి ఆమెను అస్సలు పట్టించుకోలేదు. 

కనీసం మాట్లాడించిన కూడా తనతో మాట్లాడలేదు. హరికృష్ణ మొదటి భార్య పక్కన ఉన్న వారందరితో నారా భువనేశ్వరి మాట్లాడింది. హరికృష్ణ భార్యతో మాత్రం మాట్లాడలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసి ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంత పొగరు దేనికి పలకరించినప్పుడు మాట్లాడొచ్చు కదా. 

కనీస మర్యాద లేకపోతే ఎలా అంటూ ఫైర్ అవుతున్నారు. దీనిపైన ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో అని ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మంచి విషయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ లలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: