వెండితెర వేదిక కౌన్సెప్ట్ తో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన మ‌న వూరు .. మాటా మంతి కార్యక్రమం మంచి ఆదరణ తెచ్చుకుంటుంది .. ఇక ఈ కార్యక్రమం ద్వారా రెండు లక్ష్యాలను నెరవేర్చుకోవాలన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన ఉద్దేశం .. పేద ప్రజల సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలను బలంగా ప్రజల్లోకి పంపించడం .. అలాగే పేద ప్రజలకు చేరువ‌కావ‌డం ద్వారా తన ఉనికి పదిలం చేసుకోవడం .. ప్రస్తుతం గ్రామ ప్రజల ఓటు బ్యాంకు .. ఎంతో బలంగా ఉంది ఇది వైసీపీకి అనుకూలంగా ఉంది .. ఇలాంటి సమయంలో ఆ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవడానికి తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది జనసేన ఉద్దేశం ..


అయితే ఈ క్రమంలోనే తరచుగా గ్రామీణ స‌మ‌స్య‌ల‌పైనా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పైన పవన్ కళ్యాణ్ గట్టి ఫోకస్ పెడుతున్నారు .. అందులో భాగంగానే వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని .. తద్వారా వారిని తన వైపు తిప్పుకోవాలన్నది ఈ ప్రయత్నం ..అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ అంచనాల మేరకు గ్రామీణ స్థాయిలో సుమారు 42 శాతం వరకు ఓటు బ్యాంకు ఉంది .. అయితే ఇది నిర్దిష్టంగా పడే ఓటు బ్యాంకు .. పట్నాలు, నగరాలతో పోల్చుకుంటే గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకు ఎంతో పగడ్బందీగా ఉంటుంది .. అలాగే కచ్చితంగా ఓటు వేస్తారు .. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి  కాంగ్రెస్ కు ఆ తర్వాత వైసీపీకి అండగా నిలుస్తూ వస్తున్నారు .. ఇప్పటికీ జగన్ కు గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఉంది అనే వాదన కూడా ఉంది .



ఇక గత సంవత్సరం కూటమి  ప్ర‌భంజనంలోనూ వైసీపీకి 40% ఓటు బ్యాంకు ద‌క్క‌డం వెనుక గ్రామీణుల కీలక పాత్ర పోషించారు .. ఇక ఇప్పుడు దీనిని తమ వైపు తిప్పుకోవటం ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ఓటు బ్యాంకును చిన్నబిన్నం చేయాలనేది అసలైన రాజకీయ లక్ష్యం .. అయితే ఈ క్రమంలోనే మాట మంతి పేరుతో గ్రామీణులను మ‌చ్చిక‌ చేసుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు .. అయితే ఇప్పుడు ఇది పేద ప్రజలకు గట్టిగా దగ్గర అవటంతో మంచి విజయం సాధించడంతో భవిష్యత్తులో ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేసేందుకు డిప్యూటీ సీఎం రెడీ అవుతున్నారు .. పవన్ కళ్యాణ్ దెబ్బకు వైసిపి ఏం చేస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: