
ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ సినిమాలకు కులాలు ఉండవని కులాలు కేసి ప్రేమించరని అన్నారు. ఇదో ఫాల్స్ ట్రెండ్ లా అనిపిస్తోందని ఆయన కామెంట్లు చేశారు. రాజకీయాల్లోకి కులం చొచ్చుకుపోయిందని సినిమాల్లోకి కూడా వచ్చేసిందని మంచు మనోజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయ్ కనకమేడల పవన్ కు వీరాభిమాని అని ఆయన అన్నారు.
పవన్ పై ఉన్న ఇష్టం వల్లే ఆయన అలా కామెంట్లు చేశారని మనోజ్ చెప్పుకొచ్చారు. విజయ్ కనకమేడల ఫేస్ బుక్ పోస్ట్ ఎప్పటిదో అని పవన్ ఫ్యాన్ ఇలా ఎందుకు చేస్తాడని మనోజ్ ప్రశ్నించారు. భైరవం సినిమా కోసం మెము చాలా కష్టపడ్డామని మేము సినిమా వాళ్లమని రాజకీయాలను మాపై రుద్ధుకోవడం మకు ఇష్టం లేదని మనోజ్ వెల్లడించారు.
భైరవం సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. గరుడన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. భైరవం సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల నాంది, ఉగ్రం సినిమాల తర్వాత తెరకెక్కించిన సినిమా ఇదే కావడం గమనార్హం. విజయ్ కనకమేడల రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని తెలుస్తోంది.