ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రెస్ నోట్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . టాలీవుడ్ లో కొత్త ప్రకంపనులు రేపుతుంది. మనకు తెలిసిందే తెలుగు పరిశ్రమ అంటే కొంతమందిని ఎక్కువగా హైలెట్ చేసి మాట్లాడుతుంటారు . వాళ్లలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది అని తెలియగానే టాలీవుడ్ సినీ పెద్దలు హ్యాపీగా ఫీల్ అయ్యారు . సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ఫేవర్ చేస్తాడు ..చేయగలడు .. చేసే సత్తా ఉంది అంటూ మాట్లాడుకున్నారు . అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ కూడా టాలీవుడ్ సినీ పరిశ్రమకు బాగానే హెల్ప్ చేస్తూ వచ్చారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కి వెన్నుపోటు పొడవాలని చూసారు కొంతమంది నిర్మాతలు .


ఈ విషయం ఆలస్యంగా బయటపడింది.  తెలుగు పరిశ్రమ  నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి కృతజ్ఞతలు అంటూ వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసిన విధానం అందరికీ షాకింగ్ అనిపించింది . పవన్ కళ్యాణ్ తన మనసులో ఇంత బాధను అనుభవించాడా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" సినిమా రిలీజ్ అయ్యే టయానికి థియేటర్స్ బంద్ చేయాలని చూడడం ..ఆ తర్వాత టాప్ ఫోర్ ప్రొడ్యూసర్స్ కావాలనే పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చూస్తున్నారు అని వార్తలు రావడం ..ఇదే సమయంలో థియేటర్స్ క్లోజ్ చేయడం లేదు అని వాళ్లకు వాళ్లే మాట్లాడుకొని ఎటువంటి ప్రకటన లేకుండా అంతా వాళ్లకు వాళ్లే నిర్ణయించుకోవడం .. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బాగా కోపం తెప్పించింది . దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు.

 

"కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. ఇప్పటిదాకా ఒక్కరంటే ఒక్క టాలీవుడ్ సంఘాలు ప్రతినిధులు ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవకపోవడం పట్ల ధర్మగ్రహం వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్.  అంతేకాదు సినిమా రిలీజ్ డేట్ ఉన్నప్పుడు మాత్రం టికెట్ రేట్లు పెంపుకు అనుమతులు తెచ్చుకోవడానికి మా దగ్గరికి వస్తారు అని .. మీ సమస్యలు తీరిపోయిన తర్వాత వదిలేస్తారు అని కూసింత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.  అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రివేంజ్ దెబ్బ స్టార్ట్ చేశాడు" అంటూ తెలుస్తుంది . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాని ఎవరైతే అడ్డుకోవాలని చూసారో ఆ టాలీవుడ్ స్టార్ నిర్మాతల ఇళ్లపై అలాగే వాళ్ళ సంస్థలపై ఐటి రైడ్స్ చేసేందుకు పక్కా ప్లాన్ ముందుకు వెళ్తున్నారట .



ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దీని గురించి పక్కాగా ప్లాన్ కూడా చేసేసారట.  ఎవరైతే పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలి అని చూశారో.. ఆ నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఆ సంస్థలపై ఐటి రైడ్స్ చేసేందుకు పక్క ప్లాన్ తో సిద్ధమవుతున్నారట . ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది . ఒక్కొక్కరి దగ్గర ఎంత బ్లాక్ మనీ ఉంది అ అనేది అందరికీ బాగా తెలిసిందే . ఒక్కసారి పట్టుబడితే మాత్రం చాప్టర్ క్లోజ్ . ఇక సినిమా ఇండస్ట్రీలో అడ్రస్ గల్లంతు అవ్వాల్సిందే . పవన్ ని గెలికితే ఇలానే ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . ఏదేమైనా పవన్ కళ్యాణ్ హర్ట్ అవ్వడం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ పెద్ద సునామిలా మారిపోయింది . ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచువేషన్ నెలకొంది . పవన్ కళ్యాణ్ ని ఎలా కూల్ చేయాలో కూడా టాలీవుడ్ నిర్మాతలకు అర్థం కావడం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: