ఆంధ్రప్రదేశ్ లో సినిమా హాళ్ల తీరు పైన పగడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి ఆదేశాలను జారీ చేశారు.అందుకు సంబంధించిన విషయాల పైన ప్రభుత్వ శాఖల నుంచి ఉత్తర్వులను కూడా జారీ చేయించారు. కొత్త చిత్రాలకు సంబంధించి టికెట్ల ధరల పెంపు విషయం పైన అటు నిర్మాతలు  కాకుండా ఫిలిం చాంబర్ ద్వారానే ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుంది అంటూ తెలియజేశారు.  అలాగే సినిమా థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం పైన కూడా విచారణ చేపట్టాలి అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలను జారీ చేశారట.



వీటికి తోడు ప్రేక్షకులు సైతం కుటుంబంతో సహా సినిమా చూసేలా టికెట్ల ధరలు ఉండాలని ,అలాగే ఫుడ్ ధరలు కూడా అందుబాటులో ఉంచాలనే విధంగా డిప్యూటీ సీఎం కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా సినిమా థియేటర్ల బంద్ వెనుక జనసేన వాళ్లు ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఉపేక్షించవద్దని తెలియజేశారు. ముఖ్యంగా ఈ బంద్ వెనక ఎవరున్నారనే గుట్టు బయటపడే విధంగా విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి ఆదేశాలను చారి చేసినట్టు తెలుస్తోంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.



ఇటీవలే సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు రావడంతో మంత్రి కందుల దుర్గేష్ ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పూర్తిగా అని పరిణామాలను వివరించడంతో పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఆదేశాలను జారీ చేశారు. అలాగే తాను నటించిన హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి టికెట్ల ధరలు పెంపు విషయంలో కూడా ఫిలిం ఛాంబర్ ద్వారానే ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలంటు కోరారు పవన్ కళ్యాణ్.. ఇందులో తన మన అనే భేదాలు కూడా పాటించవద్దండి అంటూ తెలియజేశారట. సినిమా టికెట్ల ధర కంటే.. లోపల పాప్ కార్న్, శీతల పానీయాలు, వాటర్ బాటిల్ సైతం భారీగా ధరలు ఉండడంతో అందుకు సంబంధించిన విషయాల పైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ధరలు నియంత్రణలో ఉండేలా చేపట్టాలని తెలియజేశారు. అప్పుడే ప్రేక్షకులు సినిమా హాళ్ళకు వస్తారని వీటిని చూసే భయపడుతున్నారని మంత్రి కందుల దుర్గేసి కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: