టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించినప్పటి నుండి క్లాస్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వాటిలో ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తమిళ హీరో అయినటువంటి ధనుష్ హీరోగా కుబేర అనే సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునమూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని జూన్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాలను లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో జూన్ 1 వ తేదీన నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

మూవీ ఆడియో లాంచ్ వేడుకకు అంతా రెడీ అయినా కూడా ఈ ఆడియో లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారు అనే విషయం పై మాత్రం ఇప్పటివరకు పెద్దగా క్లారిటీ లేదు. మరి ఈ మూవీ ఆడియో వేదికకు ఎవరైనా స్పెషల్ గెస్ట్ వస్తారా ..? లేక మూవీ యూనిట్ మాత్రమే అటెండ్ అవుతుందా అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: