టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన యువ నటీమణులలో సంయుక్త మీనన్ ఒకరు. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన భీమ్లా నాయక్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమెకు మంచి పాత్ర లభించడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

ప్రస్తుతం కూడా సంయుక్త చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరో గా రూపొందుతున్న స్వయంభు మూవీలోనూ , బాలకృష్ణ హీరో గా రూపొందుతున్న అఖండ 2 మూవీలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కి ఓ క్రేజీ కోలీవుడ్ మూవీ లో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం రాఘవ లారెన్స్ "బెంజ్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజ్ కథను అందించాడు.

మూవీ కి బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక లోకేష్ కనకరాజ్ కథను అందించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో సంయుక్త మీనన్ ను హీరోయిన్గా మేకర్స్ ఓకే చేసినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇలా సంయుక్త మీనన్ కి కోలీవుడ్ క్రేజీ మూవీ లో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sm