కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసులలో ఒకరు అయినటువంటి మంచు విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన చాలా కాలం క్రితం సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు . అందులో భాగంగా అనేక సినిమాలలో హీరోగా నటించాడు . ఇకపోతే మంచు విష్ణు కు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందించిన సినిమాలలో డీ మూవీ మొదటి స్థానంలో ఉంటుంది. డీ మూవీ ఈయనకు అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందించింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో మంచు విష్ణు నటించిన డీ స్థాయి విజయాన్ని మాత్రం ఇప్పటివరకు ఈయన అందుకోలేకపోయాడు. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్గా నటించగా ... శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీహరి ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు వరుస పెట్టి రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

ఇది ఇలా ఉంటే మంచు విష్ణు కెరియర్లో బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచిన డీ మూవీ ని కూడా రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా డీ మూవీ యూనిట్ ఈ సినిమాను జూన్ 6 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఏ స్థాయి ఇంపాక్ట్ ను చూపిస్తుందో ... ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: