నందమూరి తారక రామారావు నట వారసుడిగా బాలకృష్ణ మొదట తాతమ్మ కళా అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి వారు సినిమాలలో నటిస్తూ నందమూరి కుటుంబంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించారు బాలయ్య. రేపటి రోజున బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ గురించి కొన్ని విషయాలు అభిమానులు వైరల్ గా చేస్తున్నారు. ఒకవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ను మైంటైన్ చేస్తూ మరొకవైపు రాజకీయాలు అలాగే సినిమాలతో దూసుకుపోతున్నారు బాలయ్య.


కేంద్ర ప్రభుత్వం కూడా బాలయ్యకు పద్మభూషణ అవార్డు కూడా ప్రకటించింది. ప్రస్తుతం బాలయ్య టాలీవుడ్ లో ఉండే సీనియర్ హీరోలలో మంచి విజయాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం అయితే అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. బాలయ్య వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉన్నాయట. తెలుగు సినీ పరిశ్రమంలోనే ఇలాంటి అలవాటులో ఉన్న ఏకైక హీరోగా బాలయ్యకు మాత్రమే సొంతమైనట్లు వినిపిస్తోంది. బాలకృష్ణ సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా.. కూడా ఆరోజు షెడ్యూల్ ని ముగించేసుకొని మరి ఇంటికి వెళ్తారట.


ఇక ఉదయం 3:30 నిమిషాలకు నిద్రలేచి తన తండ్రి ఎన్టీఆర్ ఫోటోకి దండం పెట్టి.. భూమాతకు నమస్కారం చేసి మరి స్నానం చేస్తారట. అంతేకాకుండా పూజ కార్యక్రమాలను ప్రతిరోజు సూర్యోదయంలోపే చేస్తారట. అంతా అయిపోయిన తర్వాత ఒక చుట్ట కాలుస్తారట. బాలకృష్ణకు దైవభక్తి కూడా ఎక్కువగా ఉన్నది.. అందుకే పూజ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. బాలయ్య తన సినిమా షూటింగులకు ముహూర్తాలను చూసి మరి పెట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి ప్రతిభ ఉన్న వారిలో చాలా తక్కువ మంది హీరోలు ఉంటారు అలాంటి వాళ్ళు బాలయ్య కూడా ఉన్నారని చెప్పవచ్చు. మరి రేపటి రోజున బాలయ్య పుట్టినరోజు కావడం చేత సినిమాల గురించి అదిరిపోయే అప్డేట్ల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: