
ఒకటి కాదు రెండు కాదు బాలయ్య అన్ని విషయాలలో 100 కి 100% మార్కులు దక్కించుకుంటున్నాడు. కానీ ఓ విషయంలో మాత్రం బాలయ్య అసలుకి 100 కి 0 మార్క్స్ ఇవ్వాలి అంటున్నారు ఆయన అభిమానులు. బాలయ్య ఎవరినైనా సరే చాలా అమితంగా లైక్ చేస్తారు. ఆయన ఇష్టపడితే వాళ్లకోసం ఏమైనా చేస్తారు . అలా ఇష్టపడిన వాళ్ళు మోసం చేస్తే తాట కూడా తీస్తారు. అయితే బాలయ్యకి మనిషి ముందు ఒకలా మనిషి వెనక ఒకలా ఉండే గుణం లేదు . ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ కి ఓ గుణం ఉంది మీడియా ముందు ఒకలా మాట్లాడుతారు .
మీడియా వెనుక మరొకలా మాట్లాడుతారు. ఒక హీరోని పొగుడుతున్నట్లు ఏదైనా ఈవెంట్ లో మాట్లాడుతారు . కానీ అదే హీరోని బ్యాక్ గ్రౌండ్ తొక్కేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు . టాలెంట్ ఉన్న హీరోని తొక్కేసే స్టార్స్ ఇండస్ట్రీలో ఎక్కువ . కానీ బాలయ్య అలా కాదు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతాడు . నీతి నిజాయితీకి మరో మారుపేరు . బాలయ్య లా ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు . ముఖానికి రంగులు పూసుకొని తెరపై మాత్రమే కాదు తెర వెనుక కూడా కొందరు నటిస్తూ ఉంటారు కానీ ఆ విషయంలో బాలయ్యకి 0 మార్క్స్. మనిషి ముందు ఒకలా మనిషి వెనుక ఒకలా మాట్లాడడం చేతకాదు . ఆ విషయంలో బాలయ్యకి జీరో మర్క్స్ అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా బాలయ్య నిజాయితిని పొగిడేస్తున్నారు..!